తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్ల కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ ఛైర్​పర్సన్​ - Kasturba school

చేవెళ్ల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, ప్రభుత్వాసుపత్రిని రంగారెడ్డి జడ్పీ ఛైర్​పర్సన్​ అనితారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

Rangareddy ZP Chairperson

By

Published : Jul 14, 2019, 5:49 PM IST

రంగారెడ్డి జడ్పీ ఛైర్మన్​ అనితారెడ్డి స్థానిక ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి చేవెళ్ల మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజన సౌకర్యం కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినులు జడ్పీ ఛైర్​పర్సన్​కు వివరించారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు జడ్పీ ఛైర్​పర్సన్​ సూచించారు.

మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆసుపత్రిని సందర్శించి... ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అనితారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్​లోకి వెళ్లే వారు తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సలహా ఇచ్చారు. డెలివరీ రిజిస్టర్​... వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు.

చేవెళ్ల కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ ఛైర్​పర్సన్​
ఇవీ చూడండి:'కర్ణాటక సంక్షోభానికి భాజపా కారణం కాదు'

ABOUT THE AUTHOR

...view details