తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు బస్సులపై రవాణా అధికారుల నజర్ - శంషాబాద్​లో రవాణాశాఖ అధికారుల తనికీలు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్​ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు బస్సులపై కేసులు నమోదు చేశారు.

rangareddy transports officers Sudden inspections on private buses
ప్రైవేటు బస్సులపై రవాణా అధికారుల ఆకస్మిక తనిఖీలు

By

Published : Jan 10, 2021, 1:07 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతోన్న పైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్ రావు అదేశాల మేరకు బస్సులకు సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీలు చేశారు.

ఉదయం నాలుగు గంటలకే శంషాబాద్ తొండుపల్లి వద్ద చేరుకున్న రవాణా శాఖ అధికారుల బృందం మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా తిరుగుతున్న 12 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పై కేసులు నమోదు చేశారు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని ప్రవీణ్​రావు తెలిపారు. ఇకపై ప్రతి రోజు దాడులు కొనసాగుతాయని తెలిపారు.

ఇదీ చదవండి:శృంగారంలో 'అపశృతి'- ప్రియుడు మృతి

ABOUT THE AUTHOR

...view details