తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 10:32 AM IST

ETV Bharat / state

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

రంగారెడ్డి జిల్లా ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైంది.

rangareddy-distrioct-vajpayee-statue-arrangment-controversy
వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ సమీపంలో ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్​పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఆర్​అండ్​బీ అధీనంలో ఉన్న కూడలిపై భాజపా నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పని చేస్తున్నారంటూ ఆర్​ అండ్ బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కమలం శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం విగ్రహాన్ని తొలగించాలా వద్దా అనే విషయంపై ఆలోచనలో పడ్డారు.

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details