తెలంగాణ

telangana

ETV Bharat / state

Rangareddy District, Telangana Assembly Elections Result 2023 Live : మెజార్టీకి అడ్డాగా మారిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా - తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ 2023

Rangareddy District, Telangana Assembly Elections Result 2023 Live : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్​ఎస్ హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి వివేకానంద్​ గౌడ్​ 85,576 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు 70,237 ఓట్ల మెజార్టీతో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు.

Rangareddy District news
Rangareddy District political view

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 6:35 PM IST

Updated : Dec 3, 2023, 8:26 PM IST

Rangareddy District Telangana Assembly Elections Result 2023 Live : రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్నా... ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం బీఆర్​ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ మెజారిటీ నమోదయ్యంది. కుత్భుల్లాపూర్​ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ 85వేల 576 ఓట్లతో విజయ దుందుభి మోగించారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​పై విజయం సాధించారు.

Mallareddy wins Telangana Elections:ఇక మేడ్చల్​- మల్కాజిగిరి జిల్లాలో ఉన్న మొత్తం 5 స్థానాలను బీఆర్​ఎస్​ క్లీన్ స్వీప్ చేసింది. అన్నినియోజకవర్గ స్థానాల్లో విజయం సాధించింది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. 33 వేల 419 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్​ కుమార్​ యాదవ్​, బీజేపీ అభ్యర్థి సుదర్శన్​రెడ్డిపై విజయం ఢంకా మోగించారు.

Madhavaram Krishnarao Wins Telangana Elections :కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 70,237 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి బండి రమేష్, జనసేన నుంచి ప్రేమ్ కుమార్​పై విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డి విజయం సాధించారు. వీరికి ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ అభ్యర్థి ఎన్ రాంచందర్​రావుపై గెలుపొందారు.

ఉప్పల్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్​పై గెలుపొందారు.శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. ఎల్బీనగర్​లో సుధీర్​రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాష్కి గౌడ్​పై గెలుపొందారు.

మహేశ్వరంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కిచ్చనగారి లక్ష్మారెడ్డి, బీజేపీ పార్టీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ విజయ ఢంకా మోగించారు. చేవెళ్లలో 283 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీఆర్​ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలుపొందారు. స్వల్ప ఓట్ల తేడా రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ రీకౌంటింగ్ అడిగారు. కాంగ్రెస్ డిమాండ్​తో అధికారులు రీకౌంటింగ్ చేశారు. ఐదు వీవీప్యాట్​లను లెక్కించిన అనంతరం కాలే యాదయ్య గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Malreddy Rangareddy wins Ibrahimpatnam Constituency : మిగిలిన నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ అభ్యర్థులు హస్తగతం చేసుకున్నారు. వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్‌, తాండూర్‌లో మనోహర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్​రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గెలుపొందారు.

Last Updated : Dec 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details