ఆధునిక పద్ధతులు, కొత్త రకం విత్తనాలతో సాగుచేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపించారు రైతు జగదీశ్వర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి ఈయన రెండెకరాల పొలంలో కదిరి లేపాక్షి 1812 రకానికి చెందిన 90 కిలోల వేరుసెనగ విత్తనాలను నాటారు. ఈ తరహా విత్తులకు తెగుళ్లను తట్టుకొనే సామర్థ్యం ఉందని తెలిపారు.
వేరుశనగ సాగులో అద్భుతాలు సృష్టిస్తోన్నరైతు - Rangareddy district farmer cultivating peanuts through new methods
వేరుశనగ ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రంగారెడ్డి జిల్లాలోని వెల్జాల్ గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డి అనే రైతు. ఆధునిక పద్దతులు, కొత్తరకం విత్తనాలతో సాగు చేస్తూ.. అధిక దిగుబడిని సాధించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వేరు శనగసాగులో అద్బుతాలు సృష్టిస్తోన్నరైతు
జగదీశ్వర్ సాగుచేసిన పంటలో ఒక మొక్కకు అనూహ్యంగా సుమారు 200 కాయలు వచ్చాయి. సాధారణంగా మొక్కకు 100 లోపే కాయలు వస్తాయని, రెండెకరాల్లో 38 క్వింటాళ్ల దిగుబడి రావటం ఆనందంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నేటి నుంచి కరోనా టీకా మొదటి డోసు నిలిపివేత