రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో తీరుపై భాజపా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ పక్కదారి పడుతోందని ఆరోపించారు. ఆ మేరకు రాజేంద్రనగర్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా టీకా పక్కదారి పడుతోంది: సామ రంగారెడ్డి - telangana latest news
రంగారెడ్డి జిల్లాలో కరోనా టీకా పక్కదారి పడుతోందని.. భాజపా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోపై భాజపా నేతల ఆగ్రహం
ప్రభుత్వ ఆస్పత్రితో దొరకని కరోనా టీకా ప్రైవేటు ఆస్పత్రిలో ఎలా దొరుకుతుందని సామ రంగారెడ్డి నిలదీశారు. బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో కరోనా ఐసోలేషన్ పడకల కొరత ఉన్నా అధికారులు స్పందంచడం లేదని మండిపడ్డారు.
ఇవీచూడండి:సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..