తెలంగాణ

telangana

ETV Bharat / state

RR COURT: 'సామాన్య ప్రజానీకం ధైర్యంగా కోర్టులకు రావాలి' - rr court awareness programme

కోర్టులకు సామాన్య ప్రజానీకం ధైర్యంగా రావాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కోర్టులపై ప్రజల్లో ఉన్న భయం పోగొట్టేందుకు కృషి చేస్తామన్నారు.

rr court
రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఎగ్జిబిషన్ కార్యక్రమం

By

Published : Oct 20, 2021, 5:23 PM IST

రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో చట్టాలపై అవగాహన ల్పించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చట్టాలపై సామాన్య ప్రజానీకానికి పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడుతాయని రంగారెడ్డి శ్రీదేవి అన్నారు. కోర్టులపై ప్రజల్లో ఉన్న భయాలు, అనుమానాలు పోగొట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ప్రజలకు అందించే ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు. సామాన్య ప్రజానీకానికి కోర్టుల్లో అందించే సేవలపై ఆమె అవగాహన వివరించారు. సామాన్యులకు ఉచితంగా అందిస్తున్న న్యాయ సేవలపై ఉన్న సందేహాలను, సమస్యలను సీనియర్ సివిల్​ జడ్జి శ్రీదేవి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, న్యాయవాదులు, ఎన్​జీవోలు, పారా లీగల్ వాలంటీర్స్​, న్యాయవాదులు, లా విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details