హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పదివేల మొక్కల పెంపకమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి అమోయ్‌కుమార్ సూచించారు. చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రతి గ్రామంలో పది వేల మొక్కలు పెంచాలి: కలెక్టర్ - రంగారెడ్డి జిల్లా పాలనాధికారి అమోయ్‌కుమార్ తనిఖీసు
హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పది వేల మొక్కలు పెంచాలని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి అమోయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో పది వేల మొక్కలు పెంచాలి : కలెక్టర్
గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, రైతువేదికల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో హరీశ్‌కుమార్, సర్పంచులు పాల్గొన్నారు.