తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిరాశీ అర్చకులను విధుల్లోకి తీసుకోవాలి' - చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్​. రంగరాజన్​ కోరారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్​. రంగరాజన్​ తిరుమల సందర్శించారు. మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

'మిరాశీ అర్చకులను విధుల్లోకి తీసుకోవాలి'

By

Published : Nov 23, 2019, 5:26 PM IST

తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో తొలగించిన మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్​. రంగరాజన్​ కోరారు. వంశపారంపర్య వ్యవస్థను కొనసాగించేలా కోర్టు తీర్పు ఉందన్నారు. దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని... దీనిపై కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో జరిగిన మార్పుల కారణంగా సమాజంలో అనేక దారుణాలు జరుగుతున్నాయన్నారు. పాలనా వ్యవహారాలు, కోర్టుల్లో తెలుగు భాషలో కార్యకలాపాలు సాగించినప్పుడే భాషకు ప్రాధాన్యం ఏర్పడుతుందన్నారు.

'మిరాశీ అర్చకులను విధుల్లోకి తీసుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details