తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారిపై బైఠాయించి న్యాయవాదుల ఆందోళన - telangana latest news today

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలో లాయర్లు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టాలు తేవాలని విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ranga reddy lawyers protest at vijayawada main road
రహదారిపై బైఠాయించి ఆందోళన చేసిన లాయర్లు

By

Published : Feb 19, 2021, 3:03 PM IST

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులను బహిష్కరించిన లాయర్లు ఆందోళనకు దిగారు. కోర్టు ఆవరణ నుంచి న్యాయవాదులు నినాదాలు చేస్తూ రోడ్డుపైకి చేరుకున్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున ట్రాఫిక్​ జాం అయింది.

ABOUT THE AUTHOR

...view details