తెరాసలో పంచాయతీ మొదలైందని ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఇవ్వడం సీఎంకు ఇష్టం లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన వందల మంది యువకులు పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఉద్యమ సమయం నుంచి కొనసాగుతున్న వారు కాకుండా ఇతర పార్టీల నుంచి ఫిరాయించి జిల్లా నాయకులు పదవులు పొందారని విమర్శించారు. రైతులు తమ భూములను అమ్ముకోవద్దని ధరలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే తెరాసపై తిరుగుబాటు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి జిల్లా నుంచే' - దేవుని ఎర్రవల్లి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పలు గ్రామాలలో జరిగిన భాజాపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు.
'తెరాసపై తిరుగుబాటు రంగారెడ్డి నుంచే'