తెలంగాణ

telangana

ETV Bharat / state

'రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి' - 'రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి'

శాసనసమండలి స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 31న పోలింగ్​ జరగనుంది. జిల్లా యంత్రాంగం పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి చేసింది.

'రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి'

By

Published : May 28, 2019, 8:36 PM IST

రంగారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 31న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. పోలింగ్​ సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 8 కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, చేవెళ్ల ప్రాంతాల్లోని ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్​కు ఏర్పాట్లు చేయగా... ఇబ్రహీంపట్నంలో మాత్రం ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ నిర్వహించనున్నారు.

తెరాస నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ స్థానానికి పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 812 మంది ఓటర్లుండగా అందులో 592 మంది ఎంపీటీసీలు, 33 మంది జడ్పీటీసీలు, 84 మంది కార్పొరేటర్లు, 102 మంది కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ సభ్యుడు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 40 మంది ఎన్నికల సిబ్బంది, 10 మంది మైక్రో అబ్జర్వర్లు, 8 మంది పీవోలు, 24 మంది ఏపీవోలను అధికారులు నియమించారు.

ఇవీ చూడండి;జూన్‌ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details