రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ షాహీన్ నగర్ ప్రాంతంలోని నిరుపేద ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం తరఫున బహుమతులు పంపిణీ చేశారు. జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది దుస్తులు, నిత్యావసర సరుకులు అందించారు.
ప్రభుత్వం తరఫున ముస్లింలకు బహుమతులు - రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిరుపేద ముస్లింలకు బహుమతులు పంపిణీ
రంజాన్ పర్వదినం సందర్భంగా నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో బహుమతులు పంపిణీ చేశారు.
ప్రభుత్వం తరఫున ముస్లింలకు బహుమతులు
రంజాన్ పర్వదినం నాడు నిరుపేదలూ సంతోషంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు అందిస్తోందని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ అన్నారు. కరోనా కల్లోలం వేళ ఎవరి ఇంట్లో వారే పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి పురపాలక తెరాస పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్లు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు