తెలంగాణ

telangana

ETV Bharat / state

Ramoji foundation: దత్తత గ్రామంలో రూ.14.23కోట్లతో అభివృద్ధి పనులు - దత్తతగ్రామాల్లో రామోజీ ఫౌండేషన్​ సాయం

రామోజీ ఫౌండేషన్‌ దత్తత తీసుకున్న నాగన్‌పల్లి గ్రామంలో రూ.14.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శివరామకృష్ణ వెల్లడించారు. గ్రామ డిజిటలైజేషన్‌లో భాగంగా నాగన్‌పల్లి మహిళా ప్రొడ్యూర్‌ కంపెనీ లిమిటెడ్‌, యాక్సిస్‌ లైవ్లీహుడ్స్‌ సహకారంతో గురువారం 175 మంది మహిళలకు స్మార్ట్‌ ఫోన్లను రామోజీ ఫౌండేషన్‌ పంపిణీ చేసింది.

ramji
ramji

By

Published : Sep 17, 2021, 6:46 AM IST

దత్తతగ్రామం నాగన్​పల్లిలో రూ.14.23కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు రామోజీ ఫౌండేషన్​ డైరెక్టర్​ శివరామకృష్ణ వెల్లడించారు. గ్రామంలో గురువారం 175 మంది మహిళలకు స్మార్ట్​ఫౌన్​లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామకృష్ణతోపాటు చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) సలహాదారు పాపారావు మాట్లాడారు. నాగన్‌పల్లిని దేశంలోనే ఆదర్శంగా నిలపాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళ డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంతో ఫౌండేషన్‌ కృషి చేస్తోందని, అందులో భాగంగానే సెల్‌ఫోన్లు అందజేసినట్లు శివరామకృష్ణ తెలిపారు. ప్రతి రైతు ఆధునిక పద్ధతులతో సేంద్రియ వ్యవసాయం చేయడానికి.. యంత్ర పరికరాలు సమకూర్చుకునేందుకు ప్రొడ్యూర్‌ కంపెనీ, రామోజీ ఫౌండేషన్‌ చేయూత ఇస్తాయన్నారు. ముఖ్యఅతిథులతో పాటు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ సలహాదారు ముర్రే, రామోజీ ఫౌండేషన్‌ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రామోజీరావు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడాన్ని గ్రామస్థులు అదృష్టంగా భావించాలన్నారు.

ఎంతో అభివృద్ధి చేశారు..

రామోజీరావు గొప్ప మనసుతో తమ గ్రామాన్ని దత్తత తీసుకుని ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయించారని నాగన్‌పల్లి సర్పంచి జగన్‌, ఉపసర్పంచి బీరప్పలు శ్లాఘించారు. రూ.కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి శౌచాలయం, పాఠశాల, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా భవనాలు నిర్మించారని వివరించారు. గ్రామస్థులకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. నాగన్‌పల్లిలోని ప్రతి ఇంట్లో ఓ మహిళ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వివిధ రంగాల్లో ఆధునిక శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో యాక్సిస్‌ ఫౌండేషన్‌ సీఈఓ శరత్‌కుమార్‌, సభ్యురాలు భవ్య, మహిళా ప్రొడ్యూర్‌ కంపెనీ డైరెక్టర్లు రాధిక, లహరి, మాధవి, మౌనిక, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Armed Struggle: సాయుధ పోరాటంలో పాలమూరు జిల్లాది ప్రత్యేక పాత్ర

ABOUT THE AUTHOR

...view details