తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రావెల్ ట్రేడ్​ షోలో.. ఆకట్టుకుంటున్న రామోజీ ఫిల్మ్​సిటీ స్టాల్ - Jio World Convection Center Travel Trade Show

ముంబయిలో జరగుతున్న ఓటీఎమ్​ ట్రేడ్​ షోలో రామోజీ ఫిల్మ్​సిటీ స్టాల్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను ఫిల్మ్​సిటీ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Ramoji Film City
Ramoji Film City

By

Published : Feb 3, 2023, 11:54 AM IST

టూరిజం వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు.. ముంబయిలో ఏర్పాటు చేసిన ట్రేడ్‌షోలో పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెక్షన్ సెంటర్‌లో ఓటీఎమ్ పేరుతో ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్‌ షో ఎగ్జిబిషన్ నిన్న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో దేశంలోని 30 ప్రాంతాలకు చెందిన స్టాల్స్‌తోపాటు.. విదేశాలకు చెందిన 50 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

వీటన్నింటి మధ్య హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎగ్జిబిషన్‌ ఈనెల 5 వరకు కొనసాగనుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెబితే మొదట రామోజీ ఫిల్మ్​సిటీ కళ్లముందుకు వస్తుందని ఇక్కడికి వచ్చే పర్యాటకులు వ్యాఖ్యానిస్తున్నారు.

"రామోజీ ఫిల్మ్‌సిటీ పేరులోనే సినిమా ఉంది. అక్కడ చాలా సినిమా షూటింగ్‌లు జరుగుతాయి. ఇప్పుడు కూడా. కోవిడ్‌కు ముందు కూడా చాలా షూటింగ్‌లు జరిగాయి. కోవిడ్‌ తర్వాత కూడా ఇప్పుడు రోజుకు 8 నుంచి 10 సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అందులో ప్రాంతీయ సినిమాలు, బాలీవుడ్‌ సినిమాలు, టాలీవుడ్‌ సినిమాలు ఉన్నాయి. ఏ ప్రాంతీయ సినిమా అయినా రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌లు జరుగుతాయి. ఎందుకంటే మేం ఇచ్చే సర్వీసును వారు ఇష్టపడతారు. నిర్మాతలకు రామోజీ అందించే విభిన్న సౌకర్యాల పట్ల వారు సంతృప్తిగా ఉంటారు."టీఆర్‌ఎల్‌ రావు, సీనియర్‌ మేనేజర్‌ రామోజీ ఫిల్మ్‌సిటీ

ట్రావెల్ ట్రేడ్​ షోలో.. ఆకట్టుకుంటున్న రామోజీ ఫిల్మ్​సిటీ స్టాల్

ఇవీ చదవండి:డుగ్గు డుగ్గు శబ్దాలతో.. హైదరాబాద్ వాసుల గూబ గుయ్‌మంటోంది

పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ.. ఉభయసభలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details