Rajendranagar Rahul Murder Case Update :ధూల్‌పేటకు చెందిన కమల్‌సింగ్, సత్యనారాయణసింగ్, ఆనంద్సింగ్లు అన్నదమ్ములు. కమల్‌సింగ్‌కు మృతుడు రాహుల్‌సింగ్ (Rajendranagar Rahul Murder Case Update), వికాస్‌సింగ్ కుమారులు. సత్య నారాయణసింగ్‌కు రాజాసింగ్ అలియాస్ గోపీసింగ్, ఆనంద్‌సింగ్‌కు.. వినోద్సింగ్లు కుమారులు. కమల్‌సింగ్ కుటుంబం ప్రస్తుతం మణికొండ పుప్పాలగూడలో నివాసం ఉంటోంది. మిగిలిన వారు షేక్‌పేటలో నివాసం ఉంటున్నారు.
మొదటి నుంచి వినోద్‌సింగ్, గోపీసింగ్లు కలిసి మెలిసి ఉంటున్నారు. కానీ వారురాహుల్సింగ్, వికాస్సింగ్లను దూరం పెట్టారు. వీరికి తాతల నుంచి వచ్చిన ఆస్తిలో మణికొండలో 100 గజాల స్థలం ఉంది. దీంతో పాటు అదే ప్రాంతంలో 267 గజాల వాణిజ్య సముదాయం ఉంది. 100 గజాల వ్యవహారంలో ముగ్గురికి భాగం రావాల్సి ఉండగా దాన్ని రాహుల్.. వినోద్‌సింగ్, గోపీసింగ్కు రాకుండా అడ్డుపడుతున్నాడు.
కాగా వాణిజ్య సముదాయంలో ఉన్న దుకాణాల నుంచి వచ్చిన అద్దెలను.. వినోద్, గోపీలు తీసుకుంటున్నారు. వాటిలో రాహుల్ అతని సోదరుడకి మాత్రం ఇవ్వడం లేదు. దీంతో తరచూ రాహుల్ అక్కడకు వెళ్లి దుకాణదారులను బెదిరిస్తున్నాడు. దీంతో పాటుగా వారి నాయనమ్మ రత్నాభాయికి ఉన్న 750 గజాల స్థలాన్ని డెవలప్మెంట్కు ఇవ్వగా.. రెండు విల్లాలు వీరికి వచ్చాయి. వీటిని ఆమె గోపీకి, వినోద్‌కు ఇచ్చింది.
Hyderabad Girl Murder Case in Bangalore : 'ఆకాంక్ష' మర్డర్ కేసు.. ప్రియుడికి లుక్ అవుట్ నోటీసు
నాయనమ్మ నుంచి వచ్చిన ఆస్తిలోనూ వినోద్, గోపీలు.. తనకు భాగం ఇవ్వడం లేదని తరచూ రాహుల్ గొడవకు దిగుతున్నాడు. పలుమార్లు ఘర్షణకు కూడా దిగారు. ఈ విషయమై వారి పెద్దలు వారికి సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే విల్లాలకు గానూ తాను రూ.40 లక్షలు ఇస్తానని గోపీసింగ్ చెప్పగా.. వినోద్‌సింగ్ రూ.20 లక్షలు ఇస్తానని రాహుల్‌కు చెప్పారు. కానీ ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రాహుల్.. వారితో గొడవకు దిగాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని వినోద్, గోపీసింగ్లు నిర్ణయించుకున్నారు.
రాహుల్ నిత్యం జిమ్‌కు వెళుతుంటాడు. అతని దేహదారుఢ్యం చూసి తమపై దాడులు చేస్తాడని.. ఎప్పటికైనా ప్రమాదమేనని హత్య చేయించాలనుకున్న వినోద్‌సింగ్, గోపీసింగ్లు.. రెండు నెలల క్రితం వారికి పరిచయం ఉన్న టోలీచౌకికి చెందిన అక్బర్ వద్దకు వెళ్లారు. రాహుల్‌ను హతమార్చాలని అతనికి చెప్పారు. ఇందుకు రూ.15 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చున్నారు. మొదటగా రూ.10 లక్షలు ఇచ్చారు.
"రాహుల్ సింగ్ అనే వ్యక్తి సెలబ్రెటీ జిమ్ కోచ్. జిమ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో హత్యకు గురైయ్యాడు. ఇప్పుడు చనిపోయిన రాహుల్ సింగ్, వికాస్ సింగ్ కమాల్ సింగ్ పిల్లలు. కమాల్ సింగ్ వాళ్లు ముగ్గురు బ్రదర్స్. వారు సత్యనారాయణ సింగ్, ఆనంద్ సింగ్. వీరికి ఆస్తి విషయంలో గొడవలు ముందు నుంచి ఉన్నాయి. ఈ ఆస్తుల విషయంలో గొడవ కారణంగా సుపారీ ఇచ్చి హత్య చేశారు."- జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ రాజేంద్రనగర్