తెలంగాణ

telangana

ETV Bharat / state

'పనిచేయకపోతే... మళ్లీ నా ముఖం చూపించను' - రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్

మరో నాలుగేళ్లు పదవిలోనే ఉంటానని, ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరిస్తానని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ అన్నారు. పురపాలిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

rajendranagar mla prakash goud campaign for municipal elections
శంషాబాద్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం

By

Published : Jan 16, 2020, 6:46 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని ఆర్​బీ నగర్​, మధురానగర్​, ఎయిర్​పోర్ట్​ కాలనీల్లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ పర్యటించారు. పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసే తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ముందుచూపుతో సీఎం కేసీఆర్​... శంషాబాద్​ను వార్డులుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచించారని ఎమ్మెల్యే తెలిపారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సక్రమంగా పనిచేయకపోతే... మళ్లీ ఓటు అడగనని హామీ ఇచ్చారు.

శంషాబాద్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details