కరోనా విపత్కర సమయంలో ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ఫీజులు వసూలు చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. బాధితులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. నియోజకవర్గంలోని శంషాబాద్, గండిపేట, రాజేంద్రనగర్లని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించారు.
'ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి' - తెలంగాణ వార్తలు
రాజేంద్ర నగర్లోని పలు ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు అందించే వైద్య సేవలను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పరిశీలించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మానవతా దృక్పథంతో ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలని ఆయన కోరారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్లో కొవిడ్ కేర్ సెంటర్ల తనిఖీలు
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఐసోలేషన్ వార్డు రూ.4500, ఐసీయూ రూ.7500, వెంటిలేటర్ చికిత్సకు రూ. 9000 మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:'గర్భిణీలకు కరోనా సోకినా.. లోపల ఉన్న బిడ్డకు రాదు'