రాష్ట్రంలో అన్ని కులాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని కోకాపేట్, నార్సింగి, పిరం చెరువు గ్రామాల చెరువుల్లో 2 లక్షల 50 వేల చేపలను వదిలారు.
'అన్ని కులాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్' - rangareddy news
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని కోకాపేట్, నార్సింగి, పిరం చెరువు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో 2 లక్షల 50 వేల చేప పిల్లలను వదిలారు.
rajendra nagar mla distributed fish in lakes
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లోని కుంటలు, చెరువులు నిండాయని... దీనికి కారణం ముఖ్యమంత్రి తలపెట్టిన హరితహారమే కారణమని ప్రకాశ్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమానికి నార్సింగి మున్సిపల్ ఛైర్మన్, బండ్లగూడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్లు, కార్పొరేటర్, అధికారులు పాల్గొన్నారు.