తెలంగాణ

telangana

ETV Bharat / state

Bail to shilpa chowdary:శిల్పా చౌదరికి బెయిల్‌.. రేపే విడుదల - శిల్పాచౌదరికి బెయిల్

Bail to shilpa chowdary: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన కేసుల్లో శిల్పాచౌదరికి బెయిల్ లభించింది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైంది. దీంతో ఆమె రేపు చంచల్​గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.

bail to Shilpa chowdary
ల్పా చౌదరికి బెయిల్‌

By

Published : Dec 23, 2021, 7:52 PM IST

Bail to shilpa chowdary: మహిళలకు మాయమాటలు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరికి మిగిలిన రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్ రావడంతో రేపు చంచల్​గూడ జైలు నుంచి ఆమె విడుదల కానున్నారు. అయితే రాజేంద్రనగర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులో శిల్ప చౌదరికి ఇదివరకే ఉప్పర్​ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆమెపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. పలుసార్లు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details