రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. 15వ వార్డ్ కౌన్సిలర్ మునగాల అమృత సుధాకర్ రెడ్డితో కలిసి చెత్తబుట్టలు పంపిణీ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, కౌన్సిలర్లు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
శంషాబాద్ మున్సిపాలిటీకి ప్రతినెలా రూ.45 లక్షలు - Rajandra nagar Mla Prakash goud Participate in Pattana pragati
శంషాబాద్ మున్సిపాలిటీ జీవో 111 ఉండటం వల్ల ప్రభుత్వం ప్రతి నెల 45 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుందని రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
శంషాబాద్ మున్సిపాలిటీకి ప్రతినెల రూ.45లక్షల కేటాయింపు
శంషాబాద్లో జీవో 111 వల్ల నిర్మాణ అనుమతులు లేవని చెప్పారు. అందుకే ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ప్రభుత్వం 45 లక్షల రూపాయలు కేటాయిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఛైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'మోదీజీ.. ఖాతాలు కాదు ద్వేషాన్ని వదులుకోండి'