తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES: హైదరాబాద్‌ నగరానికి మరోసారి వర్ష సూచన

LIVE UPDATES
నెహ్రూనగర్‌ వద్ద రాతివాగులో ఇద్దరు గల్లంతు

By

Published : Sep 6, 2021, 10:19 AM IST

Updated : Sep 6, 2021, 5:03 PM IST

17:02 September 06

  • మరోగంటలో వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరిక
  • 6 నుంచి 8 గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక
  • ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారుల సూచన 
  • సహాయం కోసం సంప్రదించాల్సిన నం. 040- 2955 5500

16:25 September 06

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

  • శంకరపట్నం, చొప్పదండి, వీణవంక, మెట్‌పల్లి మండలాల్లో వర్షం
  • గొల్లపల్లి, గంగాధర, రామడుగు, వెల్గటూరు మండలాల్లో వర్షం
  • కమలాపూర్‌, జమ్మికుంట, కోనరావుపేట మండలాల్లో వర్షం
  • సైదాపూర్‌, పెగడపల్లి, సారంగాపూర్‌, మేడిపల్లిలో వర్షం

14:17 September 06

బొజ్జాయిగూడెం వద్ద వరద ఉద్ధృతి

  • ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం వద్ద వరద ఉద్ధృతి
  • బొజ్జాయిగూడెం సమీపంలో సాకలగుంట వాగుకు వరద ఉద్ధృతి
  • ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిని ముంచెత్తిన వరద
  • బొజ్జాయిగూడెం- కొల్లాపురం మధ్య ఈదులమోరికి వరద ఉద్ధృతి
  • అల్లపల్లి నుంచి అనిశెట్టిపల్లి మార్గంలో పొంగి ప్రవహిస్తున్న పుణ్యపు వాగు

14:17 September 06

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసిన వరంగల్ కలెక్టర్

  • భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసిన వరంగల్ కలెక్టర్
  • వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
  • వరంగల్ కంట్రోల్ రూం నంబర్లు 9154252937, 1800 425 3424
  • ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షించాలి: కలెక్టర్ గోపీ
  • వరద సమస్యలపై యుద్ధప్రాతిపదికన స్పందించాలి: కలెక్టర్ గోపీ

13:10 September 06

మీర్‌పేట్​లో ప్రజల ఇబ్బందులు..ఇళ్లలోకి చేరిన మురుగు నీరు

  • హైదరాబాద్: మీర్‌పేట్ పరిధి జిల్లెలగూడలో ప్రజల ఇబ్బందులు
  • శివసాయి నగర్, శ్రీధర్ కాలనీల్లో ఇళ్లలోకి చేరిన మురుగు నీరు
  • ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో కాలనీ వాసుల ఇబ్బందులు

12:19 September 06

మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

  • నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
  • మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 9,343 క్యూసెక్కులు
  • మూసీ ఐదు గేట్ల ద్వారా 9,343 క్యూసెక్కులు విడుదల
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 3.62 టీఎంసీలు
  • మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలు

12:19 September 06

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసిన మహబూబాబాద్ కలెక్టర్

  • భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసిన మహబూబాబాద్ కలెక్టర్
  • మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
  • టోల్ ఫ్రీ నం. 08719 240400, వాట్సప్ నం. 79950 74803

12:19 September 06

జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద

  • హైదరాబాద్‌: జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
  • హిమాయత్‌సాగర్‌లోకి వచ్చి చేరుతున్న 800 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.10 అడుగులు
  • హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు
  • హిమాయత్‌సాగర్ 2 గేట్ల ద్వారా మూసీకి 700 క్యూసెక్కులు విడుదల
  • ఉస్మాన్‌సాగర్‌లోకి వచ్చి చేరుతున్న 1200 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ 4 గేట్ల ద్వారా మూసీకి 1,360 క్యూసెక్కులు విడుదల

12:18 September 06

అశ్వాపురం, మణుగూరు మండలాల్లో భారీ వర్షం

  • భద్రాద్రి: అశ్వాపురం, మణుగూరు మండలాల్లో భారీ వర్షం
  • అశ్వాపురంలో పొంగుతున్న ఇసుక వాగు, లోతు వాగులు
  • భద్రాద్రి: భారీ వర్షాలతో 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • కొత్తగూడెం అండర్ బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకున్న 2 ఆర్టీసీ బస్సులు
  • ప్రయాణికులను ఒడ్డుకు చేర్చుతున్న అగ్నిమాపక సిబ్బంది
  • ములకలపల్లి-పాల్వంచ రహదారిపై వరద, నిలిచిన రాకపోకలు

11:44 September 06

నెహ్రూనగర్‌ వద్ద రాతివాగులో ఇద్దరు గల్లంతు

  • భద్రాద్రి: పాల్వంచ మం. నెహ్రూనగర్‌ వద్ద రాతివాగులో ఇద్దరు గల్లంతు
  • బాలిక మృతదేహం లభ్యం, బాలుడి ఆచూకీ కోసం గాలింపు

11:09 September 06

రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన వాగులు

కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన భారీవర్షానికి.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. పిట్లం మండలం రాంపూర్ కలాన్‌వద్ద లోలెవల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్దుటంతో........ పిట్లం, బాన్సువాడ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దకొడప్‌గల్ మండలం పోచారం నుంచి పోచారం తండాకు వెళ్లే మార్గంలోవంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. మద్నూర్ మండలం గోజెగావ్ లెండివాగుకు ఉదృతంగా వరద వచ్చి చేరుతోంది. మద్నూర్ మండలం డోoగ్లి-మాధన్ హిప్పర్గ గ్రామాల మధ్యనిర్మాణంలో ఉన్న వంతెన వద్ద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జుక్కల్ మండలం కౌలాస్‌నాల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

11:08 September 06

జోరు వర్షాలతో జలకళ సంతరించుకున్న వనదుర్గ ప్రాజెక్టు

రెండ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు.. మెదక్ జిల్లాలోని వనదుర్గ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతుండటంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం సమీపంలో వనదుర్గ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీటివిడుదల చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

11:07 September 06

జోరువర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వచ్చిన చేరుతున్న వరద

ఎగువ నుంచి వరద వస్తుండటంతో సహా... ప్రాజెక్టు పరిసరాల్లో కురుస్తున్న జోరు వర్షాలతో కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలు.. జలకళ సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్‌లోకి గత 15 రోజులుగా భారీగా వరదనీరు చేరడంతో 60 గేట్ల ద్వారా ఎత్తి 1,32,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌లోకి లక్షా ఒక వెయ్యిక్యూసెక్కులు వస్తోందని అధికారులు వివరించారు. ఆగస్టు 26 నుంచి.. నిరంతరాయంగా పార్వతి బ్యారేజ్ గేట్లు విడతలవారీగా ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీగా నీటిని విడుదల చేస్తున్నందున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

11:07 September 06

భారీ వర్షంతో పొంగిపొర్లిన మురుగుకాలువలు

కరీంనగర్‌లో పలు ప్రాంతాల్లో... భారీ వర్షం కురిసింది. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. విద్యానగర్, రాంనగర్ , జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లోని... ప్రధాన రహదారులు నీటమునిగాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో ఇళ్లలోకి... దుకాణాల్లో కి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముకరంపుర సిరిసిల్ల బస్ స్టాప్ ఎదురుగా... డ్రైనేజీ నీరంతా రోడ్డు పైకి వచ్చి సమీప గుడిసెలోకి చేరింది. భగత్ నగర్ కట్ట, రాంపూర్ విధులు జలమయమయ్యాయి. 

సిరిసిల్ల రోడ్డులోని పద్మా నగర్, రామ్ నగర్ ప్రధాన రహదారిపై నీరు నిలిచి... ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా చేసి వదిలేయడం... మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడంతో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలను... నగర పాలక మేయర్ సునీల్ రావు, కమిషనర్ అగర్వాల్ స్థానికులతో కలిసి పరిశీలించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో... మురుగు కాలువలు పొంగిపొర్లాయని... రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకుండా కార్యాచరణ రూపొందిస్తామని.. మేయర్‌ తెలిపారు. 

10:15 September 06

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షం

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షం
  • భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో వర్షం

10:15 September 06

బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉద్ధృతి

  • సిద్దిపేట: కోహెడ మం. బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉద్ధృతి
  • సిద్దిపేట-హనుమకొండ మార్గంలో రాకపోకలు నిలిపివేసిన గ్రామస్థులు
  • బస్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రం మీదుగా వాహనాల మళ్లింపు

10:15 September 06

జూరాల జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

  • జూరాల జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
  • జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు
  • జూరాల 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటిమట్టం 318.390 మీటర్లు
  • జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 9.39 టీఎంసీలు

10:15 September 06

అశ్వాపురం, మణుగూరు మండలాల్లో భారీ వర్షం

  • భద్రాద్రి: అశ్వాపురం, మణుగూరు మండలాల్లో భారీ వర్షం
  • అశ్వాపురంలో పొంగుతున్న ఇసుక వాగు, లోతు వాగులు
  • భద్రాద్రి: భారీ వర్షాలతో 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

10:14 September 06

కామారెడ్డి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

  • కామారెడ్డి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
  • పిట్లం మండలం రాంపూర్ కలాన్ వద్ద వరద ఉద్ధృతి
  • రాంపూర్ కలాన్ వద్ద లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న వరద
  • పిట్లం- బాన్సువాడ మార్గంలో నిలిచిన రాకపోకలు
  • పోచారం- పోచారం తండా మార్గంలో వంతెనపై వరద ప్రవాహం
  • గోజెగావ్‌లెండి వాగుకు వరద ఉద్ధృతి, రాకపోకలకు అంతరాయం
  • డోంగ్లి-మాధన్ హిప్పర్గ మధ్య వంతెన వద్ద నిలిచిన వరద

10:14 September 06

శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

  • శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
  • శ్రీరాంసాగర్ జలాశయంలోకి 61,310 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీరాంసాగర్ 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల విడుదల
  • శ్రీరాంసాగర్‌లో విద్యుదుత్పత్తి కోసం 7,500 క్యూసెక్కుల విడుదల
  • సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల విడుదల
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1090.5 అడుగులు
  • శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్‌ ప్రస్తుత నీటినిల్వ 87.561 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు

10:14 September 06

వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

  • భద్రాద్రి: వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • ఇల్లెందు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • ఇల్లెందు ఉపరితల గనుల్లో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
  • 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం

10:13 September 06

మెదక్‌ గాంధీనగర్‌లో అర్ధరాత్రి భారీ వర్షం

  • మెదక్‌ గాంధీనగర్‌లో అర్ధరాత్రి భారీ వర్షం
  • వర్షానికి 10 ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • సురక్షిత ప్రాంతానికి బాధితుల తరలింపు
  • ఫైర్‌ ఇంజిన్లతో నీటిని తోడుతున్న అగ్నిమాపక సిబ్బంది

10:07 September 06

LIVE UPDATES: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం
  • ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
  • ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Last Updated : Sep 6, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details