ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా... గ్రేటర్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 వార్డులకు పోలింగ్ జరగనుందని.. ఈ పరిధిలో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు సీపీ తెలిపారు.
బల్దియా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు: సీపీ మహేశ్ భగవత్ - Ghmc elections 2020
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో 30 వార్డులకు పోలింగ్ జరుగుతుందని సీపీ మహేశ్ భగవత్ వివరించారు.
బల్దియా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు: సీపీ మహేశ్ భగవత్
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా 8 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని... భద్రత విషయంలో ఎటువంటి రాజీపడబోమని సీపీ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ కోరారు.
ఇదీ చూడండి:కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటికి 11 ఏళ్లు పూర్తి