లాక్డౌన్ నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై... పంతంగి టోల్ ప్లాజా, కొత్తగూడెం, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. సిబ్బందికి స్నాక్స్, శానిటైజర్లు అందజేశారు.
చెక్ పోస్టులు పరిశీలించిన సీపీ మహేశ్ భగవత్ - సీపీ మహేశ్ భగవత్ వార్తలు
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా చెక్‌పోస్టులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మహేశ్ భగవత్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్నటి వరకు 35 వేల వాహనదారులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.