రంగారెడ్డి జిల్లా నాగోల్లోని శుభం కాన్వెన్షన్ హాల్లో 200 మంది ఫార్మా కంపెనీల యజమానులతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సమావేశం నిర్వహించారు. ఫార్మా ఇండ్రస్ట్రీస్కి సంబంధించిన మెటీరియల్... పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయికి చేరవేసే క్రమంలో ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు.
"నిత్యావసర, ఫార్మసీ కంపెనీ సరుకు రవాణాలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటిని సరిచేసి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తాము. 24/7 వీటి రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటాం."