తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 10:47 PM IST

ETV Bharat / state

వనస్థలిపురం ఆస్పత్రికి కియోస్క్​ మిషన్​ అందజేసిన సీపీ

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని కరోనా పరీక్షా కేంద్రానికి కియోస్క్​ మిషన్​ను సీపీ మహేశ్​ భగవత్​ అందజేశారు. డాక్టర్స్​ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మిషన్​ను సీపీ ప్రారంభించారు. ఈ మిషన్​తో కరోనా పరీక్షలు చేయటం సులువవుతుందని తెలిపారు.

rachakonda cp mahesh bhagavat started kiyask mission in vanastalipuram hospital
rachakonda cp mahesh bhagavat started kiyask mission in vanastalipuram hospital

డాక్టర్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య శాఖకు కియోస్క్ మిషన్​ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ అందజేశారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో కరోనా పరీక్షల కోసం వినియోగించే కియోస్క్ మిషన్​ను అందించారు. సీపీ మహేశ్​ భగవత్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ కలిసి మిషన్​ను ప్రారంభించారు.

రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని ప్రజలకు ఈ మిషన్ సాయంతో నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు సులువుగా ఉంటుందని సీపీ తెలిపారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని మహేశ్​ భగవత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details