ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వరుసకు సోదరులైన సోహైల్, అలీబిన్.... వాహనాలను కొనుగోలు చేస్తామంటూ విక్రయదారులను నమ్మించి వాటిని ఎత్తుకెళ్తారు.
వాహనాలను ఎత్తుకెళ్లిన ఇద్దరిపై పీడీ యాక్ట్ - cp mahesh bhagawth
వాహనాలను కొనుగోలు చేస్తామంటూ నమ్మించి వాటిని ఎత్తుకెళ్లిన ఇద్దరిపై సీపీ మహేశ్ భగవత్ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
![వాహనాలను ఎత్తుకెళ్లిన ఇద్దరిపై పీడీ యాక్ట్ rachakonda cp mahesh bagawath pd act file on two accused](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5816003-123-5816003-1579789764764.jpg)
వాహనాలను ఎత్తుకెళ్లిన ఇద్దరిపై పీడీ యాక్ట్
మీర్ పేట్, ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో 5 ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు. నవంబర్లో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. వీళ్లిద్దరిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయటంతో పాటు ఏడాది వరకు జైల్లోనే జుడీషియల్ ఖైదీలుగా ఉంచనున్నారు.
ఇవీ చూడండి: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం