రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద వరదలకు దెబ్బతిన్న ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. రహదారి మరమ్మతులు వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు.
దెబ్బతిన్న జాతీయ రహదారిని పరిశీలించిన రాచకొండ సీపీ - heavy rains in telangana
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారిని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు.
భారీ వర్షాలకు ఇనాంగూడ వద్ద రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణికులు విలవిల్లాడారు. అక్కడ ఒక వాహనం ప్రవేశించడానికి మాత్రమే అనుమతించడంతో ఇరువైపులా రద్దీ ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలు ఇనాంగూడ నుంచి వెనుకకు ఔటర్‌రింగ్ రోడ్డు దాటి అంబర్పేట్ వరకు నిలిచిపోయాయి. కొద్దిసేపు విజయవాడ వైపు వెళ్లే వాటిని మరికొద్ది సేపు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించారు. దండుమల్కాపురం నుంచి ఇనాంగూడ వరకు ఇంచుమించు 10 కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రహదారి మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులకు సీపీ సూచనలు చేశారు.
ఇవీ చూడండి: 'దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి'