రంగారెడ్డి జిల్లా డీటీసీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శంషాబాద్లో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 8 స్కూల్ బస్సులను జప్తు చేశారు. తగిన భద్రతా చర్యలు పాటించని కారణంగా వాటిపై కేసులు నమోదు చేసినట్లు అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ సోనీ తెలిపారు.
శారద విద్యామందిర్, ఒయాసిస్ స్కూల్, ఎస్ఆర్డీజీ స్కూల్, బ్రిలియంట్ స్కూల్ బస్సులతో పాటు ఒక ఆటో మరో 8 బస్సులు ఉన్నాయని తెలిపారు.