తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​కు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. స్వాగతం పలికిన గవర్నర్​, సీఎం - ముచ్చింతల్​లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

President Ramnath Kovind Muchintal Visit: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ హైదరాబాద్​ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట​ విమానాశ్రయనానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన ముచ్చింతల్​లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

President Ramnath Kovind Muchintal Visit
హైదరాబాద్​కు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్

By

Published : Feb 13, 2022, 2:52 PM IST

Updated : Feb 13, 2022, 3:11 PM IST

President Ramnath Kovind Muchintal Visit: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని సమతామూర్తి కేంద్రాన్ని.. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి.. గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​, సీఎం కేసీఆర్​ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఆర్మీ హెలికాప్టర్​లో ముచ్చింతల్​ బయలుదేరారు.

హైదరాబాద్​కు చేరుకున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

పర్యటన ఇలా

మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రపతి.. ముచ్చింతల్ చేరుకోనున్నారు. సమతామూర్తి కేంద్రంలోని 108 వైష్ణవ ఆలయాలు, బృహాన్ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి.. స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు.

రామానుజ 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహం తయారుచేశారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఈ ప్రతిమ కొలువుదీరింది. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సమతామూర్తి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు స్వర్ణమూర్తి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు.

ఇదీ చదవండి:Ramanuja Statue: 120 ఏళ్ల పరిపూర్ణ జీవనానికి ప్రతీక 120 కిలోల సువర్ణ విగ్రహం

Last Updated : Feb 13, 2022, 3:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details