స్థానిక ఎన్నికల మొదటి విడత ప్రచారం గడువు ముగియనున్నందున చేవెళ్లలో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా చేవెళ్ల మండలం ఎర్రవల్లిలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ తరఫున మండల కేంద్రంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకే గడువు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా... పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చివరి రోజున జోరుగా ప్రచారాలు - pracharam
మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం గడువు కాసేపట్లో ముగియనుంది. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆయా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
చివరి రోజున జోరుగా ప్రచారాలు