రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ అధికారులు కరోనా మృతుల అంత్యక్రియలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌తో చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యుల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కొవిడ్ మృతుల అంత్యక్రియలకోసం ప్రత్యేక బృందం - రంగారెడ్డి జిల్లా వార్తలు
కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం చేయడానికి జల్పల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మృతదేహాల ఖననం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లా
అంత్యక్రియలు నిర్వహిస్తున్న బృంద సభ్యులకు మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది... పీపీఈ కిట్లు, శానిటైజర్లు, తదితర సామగ్రి అందించారు. కొవిడ్‌తో ఎవరైనా మరణిస్తే ఆందోళన చెందవద్దని.. అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 24 గంటలు ప్రత్యేక బృంద సభ్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 8,061 కరోనా కేసులు, 56 మంది మృతి