దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో శవపంచనామా నిర్వహించనున్నారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు.
మహబూబ్నగర్లో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం - encountering four accused disha case
దిశ హత్య కేసులో ఎన్కౌంటర్కు గురైన నిందితుల మృతదేహాలకు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే శవపంచనామా చేయనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి, కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు.
ఎన్కౌంటర్ స్పాట్లోనే నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
శవపంచనామా నిమిత్తం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఉస్మానియా వైద్యులను పిలిపించారు. స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శవపంచనామా జరగనుంది.
శవపంచనామా అనంతరం మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించనున్నారు. అక్కడ శవపరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
- ఇదీ చూడండి : ట్విటర్ టాప్ 5లో తెలంగాణ పోలీస్ ట్రెండింగ్