తెలంగాణ

telangana

ETV Bharat / state

Pongal celebrations in RFC: డూడూ బసవన్నా.. ఫిల్మ్​సిటీలో సందడి చేసేనన్నా..! - ఫిల్మ్ సిటీలో సంక్రాంతి సంబురం

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది. పర్యాటకులకు సంక్రాంతి వైభవం తెలిసేలా ఫిల్మ్​ సిటీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. డూడూ బసవన్నలకు తోడు పర్యాటకుల సందడి కనిపించింది.

ramoji film city in hyderabad
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి సందడి

By

Published : Jan 13, 2022, 7:51 PM IST

ముందస్తు సంక్రాంతి సంబరాలతో హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి వాతావరణం నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తెలుగు వారి సంక్రాంతి వైభవం తెలిసేలా ఫిల్మ్‌సిటీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

బసవన్నతో ఫోటో దిగుతున్న పర్యాటకురాలు

డూడూ బసవన్నలు చేసే ఆటలు చూసి పర్యాటకులు సైతం మురిసిపోయారు. గంగిరెద్దులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. గంగిరెద్దులతో సంక్రాంతి వైభవం చాటేలా.. మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఫిల్మ్​ సిటీ యాజమాన్యం వేడుకలు నిర్వహించింది.

రామోజీ ఫిల్మ్‌సిటీలో సంక్రాంతి సంబురాలు

ABOUT THE AUTHOR

...view details