Political Heat in Rangareddy District: రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి. ప్రధాన పార్టీల్లోని నాయకులు అధిష్ఠానానికి అత్యంత దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం. అందుకే టికెట్ ఆశించే వారితో పాటు పోటీపడే వారు ఆ జిల్లాలో ఎక్కువగానే ఉంటారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ పడేందుకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి బీ-ఫామ్‌లు అందించింది. షాద్‌నగర్, చేవెళ్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.
Telangana Election Campaign 2023 : చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య మరోసారి టికెట్ దక్కించుకొని ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య ఏడాది తిరగకుండానే గులాబీ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఈసారి యాదయ్యకి పోటీగా రత్నం నిలవాలని ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్లో చేరారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఆశించినా అధిష్ఠానం సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారు.
MLA Candidates in Rangareddy District: కాంగ్రెస్ నుంచి సున్నం వసంతం, మొయినాబాద్‌కి చెందిన దర్శన్, శంషాబాద్ నుంచి సిద్ధేశ్వర్ టికెట్ ఆశించగా అనూహ్యంగా షాబాద్‌కి చెందిన భీమ్ భరత్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ నుంచి కంజెర్ల ప్రకాశ్, వరి తులసిరాం టికెట్ ఆశిస్తుండగా.. తులసిరాంకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముచిత స్థానం కల్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని రత్నం చెబుతున్నారు. రాజేంద్రగర్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను బీఆర్ఎస్ ఖరారు చేసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాక పూర్తిస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ప్రకాశ్‌గౌడ్ భావిస్తున్నారు.
"రాజకీయాల్లో అధికారం వస్తుంది.. పోతుంది. నాయకుల వెనకాల ఉన్న కార్యకర్తల భద్రత ముఖ్యం. నాకు పదవి ఉన్నా లేకపోయినా చేవెళ్ల గడ్డకు జీవితాంతం సేవ చేస్తాను. కార్యకర్తల అభీష్టం మేరకు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను." - రత్నం, బీఆర్ఎస్ నాయకుడు
Rangareddy MLA Candidates List 2023 :ఇబ్రహీంపట్నంలో మూడుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వైపే.. కేసీఆర్ మరోసారి మొగ్గుచూపారు. మరోసారి టికెట్ ఇవ్వడంతో నాలుగోసారి గెలుపునకు మంచిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రాంరెడ్డి పేర్లు తెరపైకి రాగా ప్రధానంగా మల్‌రెడ్డి రంగారెడ్డి(Mal Reddy RangaReddy) పేరు వినిపిస్తోంది. గతంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆయన.. ఈసారి మంచిరెడ్డికి గట్టిపోటీ ఇస్తాడని హస్తం పార్టీ భావిస్తోంది. బీజేపీ అభ్యర్థులెవరో ఖరారు కాలేదు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసే అవకాశం కనిపిస్తుంది. వామపక్షాలు, టీడీపీ ఇబ్రహీంపట్నంలో తటస్థంగా ఉన్నాయి.
Election Campaign in Telangana : ఎన్నికల వేళ జోరందుకున్న ప్రచారాలు.. పోటాపోటీగా ప్రజలకు ఆఫర్లు