రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీసులు అశ్వదళంతో పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసు గుర్రాలపై తిరుగుతూ గస్తీని పర్యవేక్షించారు. షాహీన్ నగర్ లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు కొవిడ్ పై అవగాహన కల్పించారు.
బాలాపూర్లో అశ్వదళంతో పోలీసుల పెట్రోలింగ్ - బాలాపూర్ లో గుర్రాలతో గస్తీ
ప్రజల శ్రేయస్సు కోసమే తాము పనిచేస్తున్నామని బాలాపూర్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో పోలీసులు అశ్వదళంతో పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
police
లాక్ డాన్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసమే తాము పనిచేస్తున్నామని పోలీసులు బాలాపూర్ సీఐ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.