విందులో సరదా కోసం చేసిన నృత్యాలు పోలీసులకు కొత్త సమస్యలు సృష్టించాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పాత్రికేయులతో కలిసి సీఐ శ్రీధర్ కుమార్ నృత్యాలు చేశారు. సమాచారం తెలిసిన అధికారులు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
కష్టాలు తెచ్చిపెట్టిన డ్యాన్సులు.. కానిస్టేబుళ్లపై చర్యలు.. - నృత్యాలతో పోలీసులకు కొత్త సమస్యలు
స్నేహితుని పెళ్లిలో సరదాగా నృత్యాలు చేయడం సర్వసాధారణం.. కానీ అవే నృత్యాలు పోలీసులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. స్నేహితుని వివాహనికి హాజరై డాన్స్ చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
కష్టాలు తెచ్చిపెట్టిన డ్యాన్సులు.. కానిస్టేబుళ్లపై చర్యలు..
తాజాగా రామేశ్వరం సమీపంలో మిత్రుని వివాహానికి వెళ్లి నృత్యాలు చేసినందుకు కొత్తూరు ఏఎస్సై బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్ రెడ్డి, అమర్నాథ్, చంద్రమోహన్, వెంకటేష్‌గౌడ్, రామకృష్ణారెడ్డిలను సైతం సీపీకి అటాచ్ చేశారు. శనివారం కొత్తూరులో ఈ విషయాన్ని డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి :డబుల్ బెడ్రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన