చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అనుచరుడి నుంచి 10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్స్ వద్ద పోలీసు తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. విశ్వేశ్వర్‌రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న సందీప్ రెడ్డి కారులో రూ. 10 లక్షలతో పాటు ల్యాప్‌టాప్, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడి నుంచి 10 లక్షలు స్వాధీనం
ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో అక్రమ నగదు బయటపడుతూనే ఉంది. మంగళవారం గచ్చిబౌలిలో జరిగిన తనిఖీల్లో పోలీసులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుచరుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నగదు స్వాధీనం
ఇప్పటివరకు డీకోడ్ లాంగ్వేజ్‌లో రూ. 10 కోట్లు పంపిణీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డికి సందీప్‌రెడ్డి సమీప బంధువని గుర్తించారు.
ఇదీ చదవండి :'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'
Last Updated : Apr 11, 2019, 12:14 AM IST