తెలంగాణ

telangana

ETV Bharat / state

PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

PM Modi on Samatamurthy: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నానని ప్రధాని తెలిపారు. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆయన వివరించారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా పేర్కొన్నారు.

PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల  బోధనలు అనుసరణీయం'
PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

By

Published : Feb 5, 2022, 7:46 PM IST

Updated : Feb 5, 2022, 7:59 PM IST

PM Modi on Samatamurthy: వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రమన్న మోదీ.. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని ఆయన చెప్పారు. రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీక అని వెల్లడించారు. రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చినజీయర్‌ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని.. ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలని మోదీ కోరుకున్నారు.

విశిష్టాద్వైతం మనకు ప్రేరణ..

మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయన్న మోదీ.. రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మనకు ప్రేరణ అని తెలిపారు. సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. రామానుజాచార్యులు అంధవిశ్వాసాలను పారదోలారన్న ప్రధాని.. భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు. ఆ సమతామూర్తి దళితులను ఆలయ ప్రవేశం చేయించారని ప్రధాని మోదీ చెప్పారు.

సమతాసూత్రమే మన రాజ్యాంగానికీ స్ఫూర్తి

రామానుజాచార్యుల సమతాసూత్రమే మన రాజ్యాంగానికీ స్ఫూర్తి అని ప్రధాని స్పష్టం చేశారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని మోదీ వెల్లడించారు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్‌ పటేల్‌ కీలకపాత్ర పోషించారన్న మోదీ.. ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహంతో సర్దార్‌ పటేల్‌ను సత్కరించుకున్నామన్నారు.

ప్రపంచ పర్యాటక తలమానికంగా సమతా విగ్రహం

తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని ప్రధాని ప్రశంసించారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామపురస్కారం లభించిందని ప్రధాని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచ పర్యాటక తలమానికంగా సమతా విగ్రహం వెలుగొందుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

‘‘రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారు. రామానుజుడి విశిష్టాద్వైతం మనకు ప్రేరణ. భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారు. రామానుచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికీ స్ఫూర్తి. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్. మన దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయి. రామానుజాచార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్ పటేల్‌ కీలక పాత్ర పోషించారు. సర్దార్‌ పటేల్‌ చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి కలిగింది’’

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

ఇదీ చదవండి:

Last Updated : Feb 5, 2022, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details