కొవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి సీఈఓ సత్విందర్ సింగ్ సబర్వాల్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ రోజును పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఫిజియోథెరపీ చాలా తోడ్పడుతుందని ఆయన అన్నారు.
Physiotherapy:'అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ అవగాహన సదస్సు'
మానసికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో తోడ్పడుతుందని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి సీఈఓ సత్విందర్ సింగ్ సబర్వాల్ తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ రోజు సందర్భంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు.
గాయం నుంచి కోలుకోవడానికి.. నొప్పి తగ్గడానికి ఫిజియోథెరపీ చాలా అవసరమని ఆస్పత్రి సీఈఓ తెలిపారు. భవిష్యత్తులో గాయాలు కాకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనానికి ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను వివరిస్తూ వారు కోలుకునేందుకు వైద్యులు రోగులకు సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఆస్పత్రి సీఈవో సత్విందర్ సింగ్ సబర్వాల్ తెలిపారు.
ఇదీ చూడండి:TS Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి