తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో... వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద జనం పడిగాపులు - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్ వనస్థలిపురం వ్యాక్సినేషన్‌ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో టీకా కోసం వచ్చిన జనం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8 గంటలకు చేరుకోవాల్సిన వైద్యులు రాకపోవడంతో రోడ్లపైనే నిరీక్షించిన ప్రజలు... వర్షం పడడంతో ఇబ్బందులు పడ్డారు.

People were troubled by the late arrival of doctors at Vanasthalipuram Vaccination Center
వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద జనం పడిగాపులు

By

Published : Jun 23, 2021, 12:46 PM IST

హైదరాబాద్ వనస్థలిపురం వ్యాక్సినేషన్‌ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో టీకా కోసం వచ్చిన ప్రజలు... గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు చేరుకోవాల్సిన వైద్యులు... ఆస్పత్రికి రాకపోవడంతో రోడ్లపైనే నిరీక్షించిన ప్రజలు... వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద జనం పడిగాపులు

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తాళం కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా... సమయానికి 30 సంవత్సరాల లోపు వారు... స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ వేయడం లేదని వాపోయారు. ఉదయం నుంచి గంటల తరబడి నిలబడినా... వైద్యులు టీకా వేయమని చెప్పడంతో అసహనంతో తిరిగి వెళ్తున్నారు.

ఇదీ చదవండి: ఇమ్మాన్యుయేల్​-వర్ష: పెళ్లిపీటలెక్కిన 'జబర్దస్త్'​ జోడీ!

ABOUT THE AUTHOR

...view details