ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఉత్పత్రి కేంద్రాల వద్ద కొవిడ్ బాధితుల బంధువులు బారులు తీరుతున్నారు. ఫలితంగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి శివారులోని ఆక్సీ విసిఒన్ మెడికల్ సర్వీసెస్ ప్లాంట్ వద్ద రద్దీ నెలకొంది.
ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఉత్పత్రి కేంద్రం వద్ద బారులు - Rangareddy district latest news
తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా బాధితులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎంతో అవసరమవుతోంది. అలాంటి ప్రాణ వాయువు కోసం కొవిడ్ రోగుల బంధువులు ఉత్పత్రి కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దాని ఫలితంగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి శివారులోని ఆక్సిజన్ ప్లాంట్ వద్ద రద్దీ నెలకొంది.
రంగారెడ్డి జిల్లాలోని ఆక్సిజన్ ఉత్పత్రి కేంద్రం
రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమయ్యే వారు ఖాళీ సిలిండర్లు తీసుకొచ్చి ప్రాణవాయువు నింపించుకొని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా సరఫరా చేస్తున్నట్లు కేంద్రం నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: రేపు తెజస ఆవిర్భావ దినోత్సవం.. కొవిడ్ నిబంధనలతో వేడుకలు