తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కష్టాలు... పరీక్షల కోసం ఉదయం నుంచి పడిగాపులు - రంగారెడ్డి జిల్లా వార్తలు

కొవిడ్ పరీక్షలు, టీకాల కోసం ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఉదయం నుంచి ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద దాదాపు 200 మంది ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

corona tests in hayath nagar
హయత్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వేచి ఉన్న ప్రజలు

By

Published : May 5, 2021, 3:17 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షల కోసం వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. కరోనా టీకా కోసం సుమారు 200 మంది ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యాక్సిన్​ కోసం వచ్చిన వారిలో 45 ఏళ్లు పైబడినవారు వృద్ధులు ఉండటంతో ఎండ తాకిడికి తట్టుకోలేక చెప్పులు క్యూలో పెట్టి చెట్ల కింద వేచి చూస్తున్నారు. ఇన్నీ ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం నుంచి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details