తెలంగాణ

telangana

ETV Bharat / state

Flood Effect : శంషాబాద్ వద్ద వరద ఉద్ధృతి.. జేసీబీ సాయంతో ప్రజల తరలింపు - heavy flood in rangareddy district

భాగ్యనగరాన్ని వరణుడు వీడటం లేదు. రోజుకోసారైనా పలకరిస్తున్నాడు. శుక్రవారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. శంషాబాద్ వద్ద భారీ వరద చేరింది. వరద ఉద్ధృతికి ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది.

శంషాబాద్ వద్ద వరద ఉద్ధృతి
శంషాబాద్ వద్ద వరద ఉద్ధృతి

By

Published : Sep 4, 2021, 11:21 AM IST

శంషాబాద్ వద్ద వరద ఉద్ధృతి

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం రోజున ఎడతెరిపిలేని వాన కురిసింది. ఈ వర్షానికి శంషాబాద్ బస్టాండ్ నుంచి పాత శంషాబాద్ వెళ్లే రహదారిలో భారీ వరద చేరింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతితో ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎటువైపు ప్రజలు అటువైపునే ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న శంషాబాద్ మున్సిపల్ ఛైర్​పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీని రప్పించి.. దాని సాయంతో ప్రజలను వరద దాటించారు. సాయంత్రం కురిసిన వర్షానికి శంషాబాద్ రైల్వే అండర్ పాసింగ్ వద్ద పెద్ద ఎత్తున వరద చేరింది. గతంలో రైల్వే కంట్రాక్టర్​లు తూతూ మంత్రంగా అండర్ పాసింగ్ నిర్మించడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వానలు కురిసినప్పుడే కాకుండా.. మామూలు రోజుల్లోనూ తమ గురించి పట్టించుకోవాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఇప్పటికైనా వరదల వల్ల ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details