రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుండడం వల్ల అధికారులు చర్యలు చేపట్టారు. జంట నగరాల పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట, గంజ్ మార్కెట్ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. మడ్‌ఫోర్డ్, చిన్నతోకట్ట, నక్కల బస్తీ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతుండగా కట్టడి చర్యలపై స్థానిక నేతలు దృష్టిసారించారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాలతో రసాయన ద్రావణాలు స్ప్రే చేశారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.
ఔదార్యం చూపింది..
నిజామాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని నగరపాలక సంస్థ పిచికారీ చేయిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా విపత్తు వేళ వనస్థలిపురానికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ యాజమాన్యం క్యాబ్ సేవలందించి.. ఔదార్యం చూపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, చౌటుప్పల్, ఇబ్రహింపట్నం వాసులు.. రాత్రికర్ఫ్యూ దృష్ట్యా ఆ క్యాబ్ సేవలను ఉపయోగించుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు.
ఊర్లోకి రాకుండా కంచె..
మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో కరోనా నియంత్రణకు స్థానికులు పక్కా చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతితో భీంపూర్ మండలం అంతర్గావ్ వాసులు తమ ఊరిలోకి మహారాష్ట్ర నుంచి రాకపోకల కట్టడికి పెన్‌గంగా నది నుంచి వచ్చే దారులను కంచె వేసి మూసేశారు. బిహార్ నుంచి కూలీలు రైలు మార్గం ద్వారా మహారాష్ట్ర, నాగపూర్ మీదుగా ఆదిలాబాద్‌కు వందలాదిగా చేరుకుంటున్నారు. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్, వరంగల్, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు పయనమవుతున్నారు. ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఎటు చూసినా బిహారీ కార్మికులే దర్శనమిస్తున్నారు. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించకుండా కిక్కిరిసి ప్రయాణం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
భార్యాభర్తలు మృతి..