Pawan Kalyan tweet on special bus for school children: పాఠశాల విద్యార్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పల్లెచెల్కతండా, సరికొండ గ్రామాల విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్రహీంపట్నం, మేడిపల్లి వెళ్లాల్సి వస్తోందని పవన్ కళ్యాన్ ట్విటర్లో పేర్కొన్నారు. బస్సు సౌకర్యం లేక ఆ గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రత్యేకించి బాలికలు అటవీ మార్గం మీదుగా పాఠశాలలకు వెళ్లి రావడం కష్టంగా ఉందని పేర్కొన్నారు.
ఆ విద్యార్థులకు ప్రత్యేక బస్సు కోసం పవన్ విజ్ఞప్తి.. స్పందించిన ఆర్టీసీ ఎండీ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
Pawan Kalyan tweet on special bus for school children: పాఠశాల విద్యార్థుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 'చిమ్మ చీకట్లో.. అటవీ ప్రాంతంలో' అనే శీర్షికతో ఈనాడులో వచ్చే కథనానికి స్పందించిన జనసేనాని.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.

రవాణా సౌకర్యం లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ట్వీట్‌కు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రస్తావించిన రూట్‌లో విద్యార్థుల కోసం ఇప్పటికే ఓ బస్సు సర్వీసును నడుపుతున్నామని సజ్జనార్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. దసరా సెలవుల నేపథ్యంలో సర్వీసును తాత్కాలికంగా నిలిపివేశామని, సెలవులు ముగిశాక తిరిగి ఈ సర్వీసును పునరుద్ధరించామని తెలిపారు. మంగళవారం ట్రాఫిక్ కారణంగా ఈ సర్వీసు గంటన్నర ఆలస్యంగా నడిచిందని ఎండీ వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: