ప్రాదేశిక ఎమ్మెల్సీ కోటాలో రంగారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన ఎమ్మెల్యేలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.
"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే" - mlc patnam mahender reddy
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఉపఎన్నికలో రంగారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. తనకు మండలి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే"