రంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన మెట్టు కుమార్‌యాదవ్ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్లో తనకు మద్దతుగా నిలిచి, తన గెలుపునకు కృషి చేసిన మంత్రి హరీశ్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి హరీశ్‌ను కలిసిన పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ - జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన మెట్టు కుమార్‌యాదవ్.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి హరీశ్‌ను కలిసిన పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్
వారి మద్దతు వల్లే 6083 ఓట్ల మెజార్టీతో గెలిచానని కుమార్ యాదవ్ అన్నారు. తన గెలుపునకు సహకరించిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలను సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్పొరేటర్‌గా గెలిచిన కుమార్‌కు హరీశ్, భూపాల్ రెడ్డిలు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు.