రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు గేట్ సమీపంలోని నారాయణ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన చేపట్టారు. మొత్తం ఫీజులు కడితేనే విద్యార్థులకు అనుమతి ఇస్తామంటూ.. యాజమాన్యం వేధిస్తోందని ఆవేదన చేందారు.
నారాయణ కళాశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన - parents protest against fees
నారాయణ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. యాజమాన్యం ఫీజుల పేరిట వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
నారాయణ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
లాక్ డౌన్లో నిర్వహించిన ఆన్ లైన్ క్లాసులకు కూడా ఫీజులు చెల్లించాలంటున్నారని తెలిపారు. మొదట చెప్పిన ఫీజు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇవే కాక.. ప్రతినెల మెస్ ఛార్జీ పేరిట రూ. 7500 వసూళ్లు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:రోడ్డు పక్క కూరగాయలు కొన్న మంత్రి సబిత