రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మాసానిగూడకు చెందిన విశ్వనాథం(58) కాంచన్‌బాగ్ బీడీఎల్‌లో ఉద్యోగి కాగా.. కుమారుడు అరుణ్‌కుమార్(33) బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. 15రోజుల క్రితం అరుణ్‌కుమార్‌కు పాజిటివ్ రాగా, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఇంటికి చేరుకున్నాడు.
కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు
కరోనా బారిన పడిన కొడుకును చూసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు వైరస్ సోకింది. కొడుకు డిశ్చార్జై హోం ఐసోలేషన్‌లో ఉండగా తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. వారి మరణవార్త విన్న కుమారుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మాసానిగూడలో చోటు చేసుకుంది.
కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు
అరుణ్ కోసం ఆసుపత్రికి వచ్చి వెళ్లిన క్రమంలో తండ్రితో పాటు తల్లి రుక్మిణి(50)కి కరోనా సోకింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. తల్లిదండ్రుల మరణవార్త తెలుసుకొని, ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఉన్న అరుణ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Last Updated : May 6, 2021, 10:45 AM IST